కరెంటిస్తేనే పోలింగ్.. 2గంటలు నిలిచిన పోలింగ్
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అమరగిరి చెంచుగూడెం వాసులు పోలింగ్‌ను బహిష్కరించారు. నాలుగు రోజులుగా అంధకారంలో ఉన్న గ్రామానికి కరెంటు సరఫరా పునరుద్ధరిస్తేనే ఓటేస్తామని వారు భీష్మించుకు కూర్చున్నారు. దీంతో 292వ పోలింగ్ బూత్‌లో ఉదయం 9గంటల వరకు ఒక్క ఓటూ నమోదు కాలేదు. చివరకు అధికారులు కరెంటును పునరుద్ధరించడంతో గ్రామస్థులు పోలింగ్‌కేంద్రానికి వచ్చారు.
- కరెంట్‌ను పునరుద్ధరించాలని అమరగిరి చెంచుగూడెంలో నిరసన
- సమస్య పరిష్కరించిన తర్వాత ఓటింగ్
కొల్లాపూర్ రూరల్, మే 13 : విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించిన తర్వాతే ఓటేస్తామని నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అమరగిరి చెంచుగూడెంలో చెంచులు రెండు గంటల పాటు పోలింగ్‌ను బహిష్కరించారు. గూడెంలోని 262 నంబర్ పోలింగ్ బూత్‌లో సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సిన ఓటింగ్, 9 గంటలైనా మొదలుకాలేదు. ఇటీవల గాలిదుమారానికి చెట్టు విరిగిపడి కరెంట్ తీగలు తెగిపోవడంతో నాలుగు రోజులుగా గూడేనికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో తమకు విద్యుత్తును తిరిగి అందించేదాకా ఓటెయ్యబోమని చెంచులు భీష్మించుక్కూర్చున్నారు. తహసీల్దార్ శ్రీకాం త్, విద్యుత్తు అధికారులు గూడేనికి చేరుకొని కరెంట్ సరఫరాను పునరుద్ధరించారు. సమస్య పరిష్కారం కావడంతో చెంచులు ఓటేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

