నందికొండ, డిసెంబర్ 28 : నాగార్జునసాగర్ డ్యాం భద్రత రాష్ట్ర ప్రత్యేక రక్షక దళం (టీజీఎస్పీఎఫ్) పరిధిలోకి వెళ్లింది. నిరుడు నవంబర్ 29న డ్యామ్ నిర్వహణ, భద్రతపై రెండు రాష్ర్టాల మధ్య వివాదం తలెత్తడంతో నిర్వహణ కేంద్ర బలగాల ఆధీనంలోకి వెళ్లింది. సీఆర్పీఎఫ్ బలగాలు రెండు బృందాలుగా విడిపోయి తెలంగాణ వైపు 13వ గేట్ వరకు ఒక టీమ్, అక్కడి నుంచి ఏపీ వైపు మరో టీమ్ విధులు నిర్వహిస్తున్నాయి. తాజా నిర్ణయంతో శనివారం సీఆర్పీఎఫ్ బలగాలు నాగార్జునసాగర్ డ్యామ్ భద్రత నుంచి వైదొలిగారు.
సీఆర్ఫీఎఫ్ బలగాలు డ్యామ్ భద్రత నుంచి వైదొలగినట్టు లిఖితపూర్వత ఆదేశాలు అందలేని ఎన్ఎస్పీ సీఈ అజయ్‌కుమార్ తెలిపారు. ఆంధ్రావైపు సీఆర్పీఎఫ్ బలగాలు కా పలా కొనసాగిస్తున్నాయి. రెండువైపులా ఉన్న టీమ్‌లు ఒకేసారి అక్కడి నుంచి రావాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశించడంతోనే తె లంగాణ వైపు నుంచి వెళ్లిపోయిన సీఆర్పీఎఫ్ బలగాలు తిరిగి వస్తున్నట్టు తెలుస్తున్నది.