నల్లగొండ : నాగార్జునసాగర్ ప్రాజెక్టు రెండు క్రస్ట్ గేట్ల ద్వారా 16,180 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ పూర్తి నీటి సామర్థ్యం 590 (312.0450 టీఎంసీలు) అడుగుల మేరకు నీరు నిల్వ ఉంది. రిజర్వాయర్ నుంచి కుడికాల్వ ద్వారా 8,144 క్యూసెక్కులు, ఎడమకాల్వ ద్వారా 7,190 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 32,236 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీ ద్వారా 1,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
సాగర్ రిజర్వాయర్‌కు 74,772 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా, 65,550 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతుంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకు 882.50 అడుగుల వద్ద 202.0439 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 54,556 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది.
ఇవి కూడా చదవండి..
Rakesh Tikait : జో బైడెన్‌కు రాకేశ్ తికాయత్ ట్వీట్.. ఏం చెప్పాడంటే?
IPL 2021 | కోల్‌కతా కెప్టెన్ మోర్గాన్‌కు షాక్.. 24 లక్షల జరిమానా
అట్టహాసంగా నమస్తే తెలంగాణ ఆటో షో ప్రారంభం