Krishna River | గద్వాల/శ్రీశైలం/నందికొండ, ఆగస్టు 28 : కృష్ణా, తుంగభద్ర నదులకు మళ్లీ వరద మొదలైంది. బుధవారం జూరాలకు 2.44 లక్షల క్యూసెక్కులు రాగా.. 45 గేట్లు ఎత్తి దిగువకు 2,86,740 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 2,14,334 క్యుసెక్కుల ఇన్‌ఫ్లోగా వస్తుండగా నాలుగు గేట్లు తెరిచి 1,12,300 దిగువకు వదులుతున్నారు.
కాగా నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు వరద ఉధృతి కొనసాగుతుండడంతో డ్యామ్ 18 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. బుధవారం సాగర్‌కు 1,94,758 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా క్రస్ట్ గేట్ల ద్వారా 1,45,800 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.50 టీఎంసీలు) కాగా ప్రస్తుతం పూర్తి స్థాయిలో నిండింది.