హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 8 ( నమస్తే తెలంగాణ ): యోగా గురువు బాబా రాందేవ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యూనివర్సిటీ ఆఫ్ పతంజలికి న్యాక్ ఏ+ గ్రేడ్ దక్కింది. అన్ని యోగా యూనివర్సిటీల కంటే అత్యధిక స్కోరుతో ఈ గ్రేడ్ దక్కించుకోవడం పట్ల యూనివర్సిటీ ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ చాన్సలర్ బాబా రాందేవ్ మాట్లాడుతూ, యువతలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడంతో పాటు వ్యక్తిత్వ నిర్మాణానికి యోగా దోహదపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భారతీయ శిక్షబోర్డ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎన్పీ సింగ్, కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్ శ్రీనివాస్ వర్ఖేడి తదితరులు పాల్గొన్నారు.