హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో సింగరేణిలో సంక్షేమ కార్యక్రమాలు, ఉద్యోగులకు అందాల్సిన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎండీ బలరాం అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్లోని సింగరేణి భవన్ నుంచి సంస్థకు చెందిన 25కు పైగా శాఖల అధిపతులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ ఇంతకాలం బొగ్గు ఉత్పత్తి, రవాణాలపై నెలవారీగా సమీక్షించామని, ఇక నుంచి కార్మికులు, ఉద్యోగుల రక్షణ, సంక్షేమంపై సైతం సమీక్షిస్తామని చెప్పారు.