Bathukamma Song | ఎల్బీనగర్, అక్టోబర్ 3: మూసీ పరీవాహక ప్రాంత ప్రజలు హైడ్రా, సీఎం రేవంత్‌రెడ్డిపై తమ ఆక్రోశాన్ని వివిధ రూపాల్లో వెళ్లగక్కుతున్నారు. చైతన్యపురి, కొత్తపేట డివిజన్లలోని ప్రజలు అమావాస్యనాడు తమ ఇండ్లను రేవంత్‌రెడ్డి దృష్టి నుంచి కాపాడాలంటూ దిష్టి తీసి నిరసన తెలిపారు. రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా పాటలు పాడుతూ బతుకమ్మ ఆడుతున్నారు. ప్రస్తుతం ఈ బతుకమ్మ పాట ఎక్స్ వేదికగా వైరల్ అవుతున్నది.
బతుకమ్మ, బతుకమ్మ ఉయ్యాలో..
బంగారు బతుకమ్మ ఉయ్యాలో..
రేవంత్ సారూ ఉయ్యాలో..
నీజాగల నీవుండూ ఉయ్యాలో..
మా ఇంట్ల మమ్మల్ని ఉయ్యాలో..
ఉండనీయ వయ్య ఉయ్యాలో..
మూసీ ప్రక్షాళన ఉయ్యాలో..
ఉన్నదాంట్లో చేయి ఉయ్యాలో..
మాఇండ్ల జోలికి ఉయ్యాలో..
నువ్వు రావొద్దయ్యా ఉయ్యాలో…
ఇకనైనా నీవు ఉయ్యాల్లో..
బుద్ధి తెచ్చుకో ఉయ్యాలో..
నీ పదవి నీకు ఉయ్యాలో..
ఉండదయ్య నీకు ఉయ్యాలో..
ఆడోళ్ల జోలికి ఉయ్యాలో..
నీవు రావొద్దయ్య ఉయ్యాలో..
ఆది పరాశక్తులం ఉయ్యాలో..
అంతమైపోతావు ఉయ్యాలో..
లండన్ల తెలిసినది ఉయ్యాలో..
చూసి వచ్చినావా ఉయ్యాలో..
హైదరాబాదులో ఉయ్యాలో..
అది జరుగదయ్య ఉయ్యాలో..
లండన్‌లో పుట్టలేదు ఉయ్యాలో..
నువ్వు లండన్‌లో పెరుగలేదు ఉయ్యాలో..
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..
బంగారు బతుకమ్మ ఉయ్యాలో..