Murder Attempt | సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. పట్టపగలే ముగ్గురిపై కత్తులతో దాడి చేసి నరికి చంపేందుకు దుండగులు యత్నించారు. బైక్ మీద వెళ్తున్న ముగ్గురిని చంపేందుకు ఓ ఐదుగురు వ్యక్తులు కారులో వెంబడించారు.
సూర్యాపేటలో ఖమ్మం క్రాస్ రోడ్ నుండి బైక్పై వెళ్తున్న ముగ్గురిని (ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు) కారులో వెంబడించగా బీబీ గూడెం సమీపంలో ఉన్న ఓ వైన్స్ ముందు బైక్ను ఆపి.. ఆందోళనతో వైన్స్ లోపలికి పరుగెత్తారు. ఆముగ్గురిని చంపడానికి కత్తులు, కర్రలతో వైన్స్ వైపు దుండగులు పరుగెత్తారు. వైన్స్ షాపులో ఉన్న వారు ఆకస్మాత్తుగా బయటికి రావడంతో వారిని చూసి దుండగులు కారెక్కి పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైన్స్ వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
సూర్యాపేట జిల్లాలో దారుణం
పట్టపగలే ముగ్గురిపై హత్యాయత్నం
బైక్ మీద వెళ్తున్న ముగురిని చంపేందుకు కారులో వెంబడించిన ఐదుగురు వ్యక్తులు
సూర్యాపేటలో ఖమ్మం క్రాస్ రోడ్ నుండి బైక్ పై వెళ్తున్న ముగ్గురిని (ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు) కారులో వెంబడించగా బీబీ గూడెం సమీపంలో ఉన్న ఓ వైన్స్… pic.twitter.com/pxMV7vyfSF
— Telugu Scribe (@TeluguScribe) August 22, 2025