బుధవారం 03 జూన్ 2020
Telangana - May 02, 2020 , 02:43:32

కాళ్లు చేతులు కట్టి

కాళ్లు చేతులు కట్టి

తోడబుట్టిన తమ్ముడిని కాళ్లు చేతులు కట్టేసి ఉరేసేందుకు యత్నించాడో అన్న. నాగర్‌కర్నూల్‌ జిల్లా తూడుకుర్తికి చెందిన తిరుపతయ్య, కుర్మయ్య అన్నదమ్ములు. కొంతకాలంగా ఇద్దరి మధ్య భూతగాదాలు ఉన్నాయి. గతనెల 29న పొలం దున్నడానికి వెళ్లిన తిరుపతయ్యపై  కుర్మయ్య కుటుంబసభ్యులు దాడిచేశారు. కాళ్లు, చేతులు కట్టేసి.. ఈడ్చుకెళ్లి చెట్టుకు ఉరేసి చంపడానికి యత్నించారు. ఈ ఘటనను తిరుపతయ్య కుమారుడు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించగా ఆలస్యంగా బయటపడింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


logo