హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ) : మున్సిపల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ ఉద్యోగాల తుది ఫలితాలను టీజీపీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది. అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ) సివిల్ ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను వెబ్సైట్లో పొందుపరిచింది. మున్సిపల్‌శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్, డ్రిల్లింగ్ సూపర్వైజర్ వంటి ఉద్యోగాల భర్తీకి 2022లో నోటిఫికేషన్ విడుదల చేయగా, 2023 అక్టోబర్‌లో పరీక్ష నిర్వహించారు. పోస్టులకు ఎంపికైన వారి జాబితా వెబ్సైట్లో ఉంచినట్టు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు.