ములుగు, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగా ణ): ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్‌కు శనివారం గుండెపోటు వచ్చింది. శనివారం ఉదయం హనుమకొండలోని తన నివాసం నుంచి ములుగు పర్యటనకు బయలుదేరే క్రమంలో తీవ్ర ఛాతీ నొప్పితో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే భార్య రమాదేవి సీపీఆర్ చేసి ప్రాణాలను కాపాడారు. సీపీఆర్ చేయగానే స్పృహలోకి రావడంతో వెంటనే హనుమకొండలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లారు. సరైన సమయంలో సీపీఆర్ చేయడం వల్ల ప్రాణహాని తప్పిందని వైద్యులు తెలిపారు.