హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ములుగులోని ఫారె స్ట్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్సీఆర్ఐ)ను తీర్చిదిద్దారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీజెర్స్ అండ్ ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్ కంచన్దేవి పేర్కొన్నారు. గురువా రం ఆమె ములుగులోని ఎఫ్సీఆర్ఐను సందర్శించారు. ఈ సందర్భంగా ఎఫ్సీఆర్ఐ డీన్ ప్రియాంక వర్గీస్, డిప్యూటీ డైరెక్టర్, బోధన సిబ్బందితో సమావేశమయ్యారు. ఎఫ్సీఆర్లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దిన తరగతి గదిని, వసతులను, ఆధునిక లేబొరేటరీ, మౌలిక వసతులు, బోధనా పద్ధతులను అభినందించారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్ ఎఫ్‌సీఆర్ ప్రతిభా వంతులైన ఫారెస్ట్ విద్యార్థులను అందించే అత్యుత్తమ ఫారెస్ట్ కాలేజీగా రూపొందుతుందని చెప్పారు.
ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్సీఆర్ఐ) విద్యార్థులు ఐకార్ పీజీ ఏఐఈఈఏ-2021 ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. 2018 బ్యాచ్‌కు చెందిన బీఎస్సీ (ఆనర్స్) విద్యార్థులు ఐదుగురు జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించారు. కళాశాలకు చెందిన వై మల్లేశ్ 16వ ర్యాంకు, ఎస్సీ క్యాటగిరిలో కే రాజు ప్రథమ ర్యాంకు, ఏ సుప్రియ రెండో ర్యాంకు, దివ్యాంగుల (పీడబ్ల్యూడీ) విభాగంలో జీ వైష్ణవి ప్రథమ ర్యాంకు, ఎస్టీ క్యాటగిరిలో డీ రాజేశ్వరి రెండో ర్యాంకు సాధించారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను, సహకరించిన అధ్యాపకులకు ఎఫ్సీఆర్ఐ డీన్ ప్రియాంక వర్గీస్ అభినందనలు తెలిపారు.