Entrance Test | హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ) : మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్(మహిళల) రాత పరీక్ష ఫలితాలను తెలంగాణ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు సోమవారం విడుదల చేసింది. బోర్డు వెబ్సైట్లో మార్కుల జాబితా అందుబాటులో ఉందని.. హాల్టికెట్, ఇతర వివరాలు నమోదు చేసి మార్కులు చెక్ చేసుకోవాలని బోర్డు సూచించింది.
త్వరలోనే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేస్తామని ప్రకటించింది. మొత్తం 1,931 పోస్టులకుగానూ కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహించగా 20,600 మంది అభ్యర్థులు పాల్గొన్నట్టు బోర్డు వెల్లడించింది.