హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ పోలీసు శాఖలో పరిపాలనాపరమైన కారణాలతో పలువురు ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ మల్టీ జోన్-1 ఐజీపీ సంపత్ చంద్రశేఖర్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మల్టీ జోన్-1 పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు చేసిన సిఫార్సుల మేరకు పలువురు సరిల్ ఇన్స్పెక్టర్లను (సివిల్) జోన్ పరిధిలోని పలు ప్రాంతాలకు బదిలీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని పేరొన్నారు. ఈ ఉత్తర్వుల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం ఎస్బీ ఇన్స్పెక్టర్గా ఉన్న చెన్నూరి శ్రీనివాస్‌ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్‌హెచ్‌వోగా, వరంగల్ కమిషనరేట్ సీఎస్బీ ఇన్స్పెక్టర్ యాడ్లపల్లి సతీశ్‌ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల సరిల్కు బదిలీ చేశారు.
ఇకడ పనిచేస్తున్న దగ్గు మల్లేశంను మల్టీ జోన్-1 కార్యాలయానికి, నిజామాబాద్ పీసీఆర్‌లో పనిచేస్తున్న సండ్ర వీరయ్యను కామారెడ్డి జిల్లా సదాశివనగర్ ఎస్‌హెచ్‌వోగా, ఇకడ ప్రస్తుతం పనిచేస్తున్న బండి సంతోశ్‌కుమార్‌ను సీసీఎస్ కామారెడ్డికి, సీసీఎస్ కామారెడ్డిలో పనిచేస్తున్న సల్వాడీ రామన్‌ను నిజామాబాద్ పీసీఆర్‌కు బదిలీ చేశారు. రామగుండం టాస్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ తెల్లబోయిన కిరణ్‌ను, డీఐఎస్జీ కంట్రోల్ రూమ్‌లో ఉన్న అనుముల శ్రీనివాస్, ఓడీ-టీజీఐసీసీలోని భరత్సుమన్ను వరంగల్ కమిషనరేట్‌కు బదిలీచేస్తూ ఆదేశాలు జారీ చేశారు. బదిలీ అయిన అధికారులు వెంటనే తమ