హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ) : ఉర్దూ అకాడమీ చైర్మన్‌గా ఖాజా ముజీబుద్దీన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నగరంలోని నాంపల్లి హజ్‌హౌస్‌లో ఆయనకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రులు మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్‌రెడ్డి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే వారిని అధిష్ఠానం తప్పక గుర్తిస్తుందని, అందుకు ముజీబుద్దీన్ ఉదాహరణ అని పేర్కొన్నారు. ముజీబుద్దీన్‌కు ఉర్దూ అకాడమీ చైర్మన్‌గా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మంత్రి వేముల కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యే హన్మంతు షిండే, హజ్ కమిటీ చైర్మన్ మహ్మద్ సలీం పాల్గొన్నారు.