హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : లంబాడీలను ఎస్టీ క్యాటగిరీ నుంచి తొలగించే కుట్రలను మానుకోవాలని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మూడావత్ రాంబల్‌నాయక్ సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అనుచరులు.. కొన్ని తెగలను ఎస్టీ క్యాటగిరీ నుంచి తొలగించాలని సుప్రీం కోర్టులో కేసులు వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు.
లగచర్లలో ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా, ఫోర్త్‌సిటీ పేరుతో లంబాడీల భూములను కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేయకుండా పోరాడడంతోనే లంబాడీలపై సీఎం రేవంత్‌రెడ్డి కక్ష పెంచుకున్నట్టు ఆరోపించారు. తక్షణమే సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌ను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. లంబాడీలపై కుట్రలను తిప్పికొట్టేందుకు మేధావులు, విద్యార్థులు ముందుకురావాలని పిలుపునిచ్చారు.