ముషీరాబాద్, మార్చి 4: తెలంగాణ తొలిదశ ఉద్యమ నాయకురాలు, మాజీ డిప్యూటీ స్పీకర్ సదాలక్ష్మి విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం విద్యానగర్‌లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆరు దశాబ్దాలుగా క్రియాశీలక రాజకీయాల్లో రాణించిన సదాలక్ష్మి విగ్రహాన్ని ట్యాంక్‌బండ్ ఏర్పాటు చేస్తామని గతంలో హామీ ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు బంగారు శ్రీను, పాలడుగు శ్రీనివాస్, కొల్లూరి వెంకట్, శ్యామ్‌రావు తదితరులు పాల్గొన్నారు.