హైదరాబాద్, ఆగస్టు 31 (నమ స్తే తెలంగాణ): డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని అందజేసే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు తెలంగాణకు చెందిన డాక్టర్ నందవరం మృదుల ఎంపికయ్యారు. బేగంపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో తెలుగు అసొసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మృదులను కేంద్ర విద్యాశాఖ ఎంపికచేసింది.
ఉన్నత విద్యాసంస్థలు, పాలిటెక్నిక్ కాలేజీల నుంచి జాతీయంగా 16 మందిని ఎంపికచేయగా, తెలంగాణ నుంచి మృదుల ఎంపికయ్యారు. 5న ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో రాష్ట్రపతి చేతులమీదుగా ఆమె అవార్డు అందుకోనున్నారు.