‘నల్లమల’ అందాలు అదరహో.. ఎంపీ సంతోష్ కుమార్ ట్వీట్
Nallamal Forest | నల్లమల పేరు వింటేనే అభయారణ్యంతో పాటు అడవి అందాలు గుర్తుకొస్తాయి. నల్లమల అంటేనే ఒళ్లు పులకరించి పోతుంది. దట్టమైన అరణ్యాలు, పశుపక్షాదుల సోయగాలతో మనసును రంజింపజేస్తుంది. అడవితల్లి ఒడిలో పారే సెలయేళ్లు.. పక్షుల కిలకిల రావాలు ఆకుపచ్చని అందాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. కనుచూపుమేర పచ్చదనం.. నింగిని తాకుతున్నట్లుగా కనిపించే అరుదైన వృక్షాలు.. పర్యాటకుల మనసును ఆహ్లాదపరుస్తాయి. ఆ అభయారణ్యంలో ఎన్నో వన్యప్రాణులు తలదాచుకుంటూ తమ సంతతిని వృద్ధి చేసుకుంటున్నాయి. అడవిని చీల్చుతూ ముందుకుసాగే రోడ్డు వెంట ఎన్నో మరెన్నో అందాలు చూడొచ్చు.
అంతటి మహాద్భుతమైన నల్లమల అందాలను రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు. చినుకు పడితే చాలు పుడమి తల్లి పలకరించి పచ్చని చీర కట్టుకున్నట్లుంది. ఈ వర్షాకాలంలో నల్లమల ఆకుపచ్చని అందాలతో కనువిందు చేస్తున్నదని సంతోష్ కుమార్ తెలిపారు. ఈ వర్షాకాలంలో నల్లమల అత్యంత అద్భుతంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ అడవుల్లో ఉన్న వృక్షాలను, జంతువులను కాపాడుకోవడానికి అటవీశాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాన్ని తప్పకుండా అభినందించాలి. తెలంగాణ ఇలాంటి అడవులు ఉన్నందుకు మనమందరం గర్వపడాలని సంతోష్ కుమార్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
Few more glimpses 👇 pic.twitter.com/7eqxCEVSn7
— Santosh Kumar J (@MPsantoshtrs) June 24, 2022
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ రన్టైమ్ 3 గంటల 15 నిమిషాలా .. సినిమా నిడివిపై ఆసక్తికర ప్రచారం!
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

