నల్లమల అదరహో..
నల్లమల పేరు వింటేనే అభయారణ్యంతోపాటు అడవి అందాలు గుర్తుకొస్తాయి. నల్లమల అంటేనే ఒళ్లు పులకరించి పోతుంది. దట్టమైన అరణ్యం, పశుపక్ష్యాదు లు, వన్యమృగాల సోయగాలతో మనసును రంజింపజేస్తుంది.
- ఎంపీ సంతోష్‌కుమార్ ట్వీట్
హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): నల్లమల పేరు వింటేనే అభయారణ్యంతోపాటు అడవి అందాలు గుర్తుకొస్తాయి. నల్లమల అంటేనే ఒళ్లు పులకరించి పోతుంది. దట్టమైన అరణ్యం, పశుపక్ష్యాదు లు, వన్యమృగాల సోయగాలతో మనసును రంజింపజేస్తుంది. అడవితల్లి ఒడిలో పారే సెలయేళ్లు.. పక్షుల కిలకిల రావాలు, ఆకుపచ్చని అందాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. కనుచూపుమేర పచ్చదనం.. నింగిని తాకుతున్నట్టు కనిపించే అరుదైన వృక్షాలు.. పర్యాటకుల మనసును ఆహ్లాదపరుస్తాయి. ఆ అభయారణ్యంలో ఎన్నో వన్యప్రాణులు తలదాచుకొంటూ తమ సంతతిని వృద్ధి చేసుకుంటున్నాయి.
అడవిని చీల్చుతూ ముందుకుసాగే రోడ్డు వెంట ఎన్నో మరెన్నో అందాలు చూడొచ్చు. అలాంటి మహాద్భుతమైన నల్లమల అందాల చిత్రాలను రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు సంతోషకుమార్ శుక్రవారం ట్వీట్ చేశారు. ‘చినుకు పడితే చాలు పుడమి తల్లి పులకరించి పచ్చని చీర చుట్టుకున్నట్టుంది. ఈ వర్షకాలంలో నల్లమల ఆకుపచ్చని అందాలతో కనువిందు చేస్తున్నది. ఈ సారి నల్లమల అత్యంత అద్భుతంగా ఉన్నది. ఈ అడవుల్లో ఉన్న వృక్షాలను, జంతువులను కాపాడుకోవడానికి అటవీశాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాన్ని తప్పకుండా అభినందించాలి. తెలంగాణలో ఇలాంటి అడవులు ఉన్నందుకు మనమందరం గర్వపడాలి’ అని ఎంపీ సంతోష్‌కుమార్ ట్వీట్లో పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

