KTR Birthday | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ తన 47వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్కు రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్ డే అన్నయ్య అంటూ సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు. మీతో ఉన్న ప్రతి జ్ఞాపకం తన హృదయానికి దగ్గరగా ఉంటుందని పేర్కొన్నారు. మీ అంకితభావం, దయ, దూరదృష్టి గల నాయకత్వం తామందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుందని సంతోష్ కుమార్ తన ట్వీట్లో పేర్కొన్నారు. థాంక్యూ సంతూ అంటూ కేటీఆర్ రీట్వీట్ చేశారు.
Thanks Santu 😊 https://t.co/JK55UgLL11
— KTR (@KTRBRS) July 24, 2023