హైదరాబాద్,జూలై 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను అధిష్ఠానం చూసుకుంటుందని కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి అన్నారు.
సోమవారం న్యూఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ విషయాలు బహిరంగంగా మాట్లాడొద్దని హెచ్చరించారు. ఇటీవల రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. తాను పదేండ్లు ముఖ్యమంత్రిగా ఉంటానని రేవంత్‌రెడ్డి ఏ సందర్భంలో అన్నారో రాజగోపాల్‌రెడ్డికి పూర్తిగా తెలియదని పేర్కొన్నారు.