హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని వడియారం రైల్వే స్టేషన్‌ను అమృత్ భారత్ స్టేషన్ పథకంలో చేర్చాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కోరారు.
మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. వడియారం స్టేషన్ మూడు జిల్లాలకు మధ్యలో ఉంటుందని, వేలాది మంది ప్రయాణికులకు అనువుగా ఉంటుందని, ఈ స్టేషన్‌ను అభివృద్ధి చేయాలని కోరారు.