తెలంగాణతో పెట్టుకుంటే కొరివితో తలగోక్కున్నట్లే : ఎంపీ కవిత ఫైర్
మహబూబాబాద్ : తెలంగాణతో..సీఎం కేసీఆర్‌తో పెట్టుకుంటే కొరివితో తలగోక్కున్నట్లేనని మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత అన్నారు. మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పనితీరుపై దునుమాడారు.
ఇటీవల జిల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రి అభివృద్ధి జరుగలేదన్న తీరుపై ఘాటుగా స్పందించారు. జిల్లాలో కోనసీమను మరిపిస్తున్న పచ్చని పంటచేలు, కంటి రెప్పవేసినంత సేపు కూడా పోని కరెంట్ సరఫరా, ఇంటింటికి శుద్ధిచేసిన తాగునీటిని అందిస్తున్న మిషన్ భగీరథ, ప్రత్యేక పంచాయతీలుగా మారిన తండాలు, ఆధునిక వైద్యం ఉచితంగా అందిస్తున్న ప్రభుత్వ దవాఖానలు చూసి మాట్లాడాలని హితవు పలికారు.
బీజేపీ ప్రభుత్వం కేవలం అదాని, అంబానీలకు కొమ్ము కాస్తూ.. వారి బ్యాంకు రుణాలను మాఫీ చేస్తూ వారికి ఆసరాగా నిలుస్తుందని విమర్శించారు. కానీ, సీఎం కేసీఆర్ పేదల పక్షం వహిస్తూ అభివృద్ధి చేస్తున్నారన్నారు. ప్రజలు పెద్ద మనసుతో ఆలోచించి సీఎం కేసీఆర్‌కు అండగా నిలువాలన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

