హైదరాబాద్, ఏప్రిల్ 25, 2025: బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక గీతంతో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోశ్‌కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ అచంచలమైన ప్రయాణం, అపూర్వ నాయకత్వం వల్ల ప్రత్యేక తెలంగాణ కల సాకారమైందని ఆయన కొనియాడారు. హ్యాపీ సిల్వర్ జూబ్లీ అని పేర్కొంటూ ట్విట్టర్(ఎక్స్) వేదికగా ఒక కేసీఆర్, బీఆర్ఎస్ ప్రయాణంపై ఒక పాటను రిలీజ్ చేశారు. దాని మన ప్రియతమ నేత కేసీఆర్‌కు అంకితమిస్తున్నానని చెప్పారు.
ఎంపీ సంతోశ్‌కుమార్ విడుదల చేసిన ఈ పాట బీఆర్ఎస్ శ్రేణులతో పాటు తెలంగాణ అభిమానుల హృదయాలను హత్తుకుంటుంది. బీఆర్ఎస్ 25 ఏళ్ల విజయగాథలో ఈ మధురమైన గీతం నిలిచిపోతుందని అభిమానులు ఆశిస్తున్నారు. కాగా, బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో అధినేత కేసీఆర్‌పై తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ ఒక పాటను రూపొందించారు. జయ జయ జననేత.. తెలంగాణ జాతిపిత.. అనే లిరిక్స్‌తో సాగే ఈ పాటను శుక్రవారం నాడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. హైదరాబాద్ నందినగర్‌లోని నివాసంలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి ఈ పాటను ఆయన విడుదల చేశారు.
A powerful tribute through song… celebrating #25Years of @BRSparty and the relentless journey of Sri #KCR garu. His unmatched leadership turned the dream of a separate #Telangana into a historic reality. Happy Silver Jubilee! I dedicate this song to our beloved leader, Sri… pic.twitter.com/qU3dV2Nvxd
— Santosh Kumar J (@SantoshKumarBRS) April 25, 2025