హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): గణతంత్ర దినోత్సవం వేళ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నివాసానికి బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వెళ్లడం రాజకీయవర్గాల్లో కొత్త చర్చకు తెరలేపింది. ఇటీవల మంత్రు ల మధ్య తలెత్తిన విభేదాల నేపథ్యం లో మంత్రిని బీజేపీ ఎంపీ కలవడం చర్చనీయాంశమైంది. సోమవారం హైదరాబాద్లోని కోమటిరెడ్డి నివాసానికి ఎంపీ అరవింద్ వెళ్లి కలిశారు. 15 నెలలుగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో రూ.8.68కోట్ల విలువైన ప నుల మంజూరుకు సంబంధించి ఆర్అండ్బీ శాఖలో పెండింగ్లో ఉన్న వా త్వరగా అనుమతులు ఇవ్వాలని కోరా రు. దీనిపై స్పందించిన కోమటిరెడ్డి.. తక్షణమే మంజూరు ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేసినట్టు అరవింద్ వెల్లడించారు.