హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): సీపీఎస్‌ను రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రముఖ రైతు నాయకుడు, ఎంపీ అమ్రారామ్ కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఇబ్బందిగా మారిన సీపీఎస్ రద్దుకు పోరాటాలను ఉధృతంచేయాలని పిలుపునిచ్చారు. స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్టీఎఫ్ఐ) కేంద్ర కార్యాలయ నూతన భవనాన్ని ఢిల్లీలోని ఫరీదాబాద్‌లో ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఎస్టీఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు హరిక్రిష్ణన్, జాతీయ ప్రధాన కార్యదర్శులు మయాంక్ బిశ్వాస్, భారతి, ఉపాధ్యక్షుడు రవి, దుర్గాభవాని, జంగయ్య పాల్గొన్నారు.