హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : విద్యుత్తు సవరణ బిల్లుపై తాము ఎలాంటి ఉద్యమానికైనా సిద్ధమని విద్యుత్తు అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (వీఏవోఏటీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాపకంటి అంజయ్య అన్నారు. సోమవారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్.. కేంద్రప్రభుత్వ తీరును స్పష్టంగా ఎండగట్టారని చెప్పారు. ఇందుకు ముఖ్యమంత్రికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు దేశవ్యాప్త పోరాటానికి 20వేల విద్యుత్తు అకౌంట్స్ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.