పటాన్చెరు, జూన్ 15 : ఎనిమిదేండ్ల చిన్నారిని కన్నతల్లి హత్య చేసింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో శనివారం వెలుగుచూసింది. పాత రామచంద్రాపురం వాసి కర్రె విష్ణువర్ధన్ (8) తండ్రి కుమార్ మృతి చెందడంతో తల్లి కర్రె స్వాతి (30) వద్ద పెరుగుతున్నాడు. స్వాతి ఏపీలోని ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన ఆటోడ్రైవర్ అనిల్‌ను రెండో పెండ్లి చేసుకున్నది. ఈనెల 10న అన్నం తినే సమయంలో విష్ణువర్ధన్ అల్లరి చేయడంతో ఆగ్రహంతో బాలుడి గొంతునులిమి చంపింది. అనిల్, స్వాతి కలిసి అర్ధరాత్రి ముత్తంగి ఔటర్ రింగ్‌రోడ్డు వద్ద సర్వీస్ రోడ్డు పొదల్లో విష్ణువర్ధన్ మృతదేహాన్ని పారవేశారు. దర్యాప్తులో తానే హత్య చేశానని స్వాతి అంగీకరించింది. దీంతో పోలీసులు స్వాతి, అనిల్‌ను అరెస్టు చేశారు.