మిర్యాలగూడ, నవంబర్ 22: తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ వృద్ధురాలు తన ఇద్దరు కూతుళ్లతో కలిసి పురుగులమందు డబ్బాతో శనివారం రాత్రి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. నల్లగొండ జిల్లా అవంతీపురానికి చెందిన ఉప్పతల సుగుణకు ఉన్న 1.10 ఎకరం భూమిని తను కొడుకు రాయించుకుని తనను ఇంటి నుంచి గెంటివేశాడు.
కలెక్టర్, ఎస్పీ, సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండాపోయింది. న్యాయం చేయాలంటూ సుగుణ నిరసనకు దిగింది.