లింగాల, మే 20 : ఓ తల్లి తన కూతురిని నీటిసంపులో పడేసి చంపిన ఘట న నాగర్కర్నూల్ జిల్లా లింగాల మం డలం చెన్నంపల్లిలో చోటు చేసుకున్నది. ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నంపల్లికి చెందిన మేకల రాములు, ఎల్లమ్మ దంపతుల రెండో కూతురు మేకల నవిత(6). సోమవారం అర్ధరాత్రి బాలిక నిద్రలో ఉండగా తల్లి ఎత్తుకొని వెళ్లి ఇంటిపక్కనే ఉన్న నీటి సంపులో పడేసింది.
గమనించిన బాలిక చిన్నాన్న వెంటనే సంపులో నుంచి చిన్నారిని బయటకు తీయగా అప్పటికే మృతిచెందింది. ఎల్లమ్మ ఐదు నెలల క్రితం భర్తను హత్య చేసి జైలుకు వెళ్లి, రెండు నెలల క్రితం బెయిల్పై వచ్చింది. మృతురాలి నానమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వెల్లడించారు.