క్షణికావేశానికి రెండు ప్రాణాలు బలి
క్షణికావేశంలో ఓ తల్లి తన రెండేండ్ల కూతురుకు పురుగుమందు తాగించి తానూ ఆత్మహత్యకు పాల్పడింది.
ములకలపల్లి, అక్టోబర్ 19 : క్షణికావేశంలో ఓ తల్లి తన రెండేండ్ల కూతురుకు పురుగుమందు తాగించి తానూ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం రాజుపేట కాలనీలో బుధవారం చోటుచేసుకొన్నది. స్థానికులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కొయ్యల అనూష(25) పుట్టింటికి వెళ్తానని భర్త మల్లయ్యను కోరగా, తాను జ్వరం, విరేచనాలతో బాధపడుతున్నానని, ఈ సమయంలో ఎలా వెళ్తావని అన్నాడు. దీంతో మనస్తాపానికి గురైన అనూష క్షణికావేశంలో ఇంట్లో ఉన్న పురుగుమందును తన రెండేండ్ల కుమార్తె నక్షత్రకు తాగించి, ఆ తర్వాత తాను కూడా తాగింది. వెంటనే మల్లయ్య.. భార్య, కూతురిని ఆటోలో ములకలపల్లి పీహెచ్సీకి తరలించారు. పరిస్థితి విషమించడంతో పాల్వంచ ప్రభుత్వ ఏరియా దవాఖాన తీసుకెళ్తుండగా తల్లీకూతురు మృతిచెందారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

