టూర్‌కు పోవుడే!

- ఈ ఏడాది ప్రయాణానికి 69% మంది మొగ్గు
- స్వదేశంలో 54%, విదేశీ టూర్‌కు 46% మంది సిద్ధం
- కరోనా వేళ వ్యక్తిగత ఆరోగ్య భద్రతకు అధిక ప్రాధాన్యం
- థామస్‌కుక్ ఇండియా, ఎస్‌వోటీసీ ట్రావెల్ సర్వేలో వెల్లడి
హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): ‘ఇంట్ల ఉండుడు ఇక కుదరదు. బయట గాలి పీల్చుకోవాల్సిందే. చలో ఒక టూర్ పొయ్యొద్దాం’ అంటూ దేశంలో ఎక్కువమంది ప్రయాణానికి మొగ్గు చూపుతున్నారు. వ్యక్తిగత ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ప్రయాణాలకు సిద్ధమవుతున్నారు. కరోనా పరిస్థితులు కాస్త కుదుటపడిన నేపథ్యంలో ఈ ఏడాదే టూర్‌కు ప్లాన్ చేసుకుంటున్నామని 69 శాతం మంది చెప్పారు. 31 శాతం మంది వచ్చే ఏడాది చూద్దామని పేర్కొన్నారు. కరోనా దృష్ట్యా వ్యక్తిగత ఆరోగ్య భద్రతను పరిగణనలోకి తీసుకొని ప్రయాణిస్తామని 70 శాతం మంది చెప్పారు. ప్రయాణికులు ఏం అనుకుంటున్నారు.. ఏం కోరుకుంటున్నారో తెలుసుకునేందుకు ప్రముఖ ట్రావెల్స్ సంస్థలు థామస్‌కుక్ ఇండియా, ఎస్‌వోటీసీ ట్రావెల్స్ ఇటీవల సర్వే నిర్వహించాయి. ‘థర్డ్ హాలిడే రెడినెస్ రిపోర్ట్’ను విడుదలచేశాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నగరాలు, పట్టణాలు దిల్లీ, ముంబయి, పుణె, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, జైపూర్, ఇండోర్, తిరుచిరాపల్లి, మదురై, నాగ్‌పూర్, సూరత్, బరోడా, భువనేశ్వర్, లక్నో, చండీగఢ్, మైసూర్, కోయంబత్తూర్, విశాఖపట్నం, పాట్నా నగరాల్లో వేలమందిని సర్వే చేశాయి.. సర్వే నివేదిక ప్రకారం..
- 69%: ప్రయాణాలకు సిద్ధం అంటున్నారు. (ఇందులో 18 శాతం మంది తక్షణమే టూర్‌కు వెళ్లాలి అనుకుంటుండగా, 51 శాతం మంది వచ్చే మూడు నుంచి ఆరునెలల్లో వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.)
- 70%: వ్యక్తిగత ఆరోగ్య రక్షణ కోరుకుంటున్న ప్రయాణికులు. (టూర్‌కు వెళ్లాక రీ-శానిటేషన్ గదులు కావాలన్నవారు 52 శాతం, స్టాఫ్, డ్రైవర్లు వ్యాక్సిన్ వేసుకొని ఉన్న హోటళ్లు మాత్రమే కావాలన్నవారు 48 శాతం)
- 66%: వ్యక్తిగత ఆరోగ్య రక్షణకు అవసరమైతే ఎక్కువ ఖర్చు చేసేందుకు సంసిద్ధత వ్యక్తంచేసినవారు.
- 54%: స్వదేశీ టూర్లకు వెళ్దామనుకున్నవా రు. వీరు కశ్మీర్, లడక్, హిమాచల్‌ప్రదేశ్, అండమాన్, గోవా, కేరళను ఆప్షన్లుగా ఎంచుకున్నారు.
- 46%: అంతర్జాతీయ టూర్లకు పోదాం అనుకుంటున్నవారు. వీరు దుబాయ్- అబుదాబీ, మాల్దీవులు, మారిషస్, థాయ్‌లాండ్, యూరప్‌ను ఎంచుకున్నారు.
- 52%: ఆరు నుంచి 12 రోజుల వరకు హాలిడేపై వెళ్లాలనుకుంటున్నవారు. (35 శాతం మంది మూడు నుంచి 5 రోజులు, 13 శాతం మంది 12 రోజులకు మించి వెళ్లాలనుకుంటున్నారు)
- 62%: స్నేహితులు, కుటుంబాలతో కలిసి ప్రయాణాలు చేయాలనుకుంటున్నవారు. 20 శాతం మంది భార్య లేదా భర్తతో కలిసి లేదా ఒంటరిగా, 18 శాతం మంది వ్యాక్సిన్ వేసుకున్నవారితో మాత్రమే ప్రయాణిస్తామనిచెప్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

