దేశంలో బీజేపీ వ్యతిరేక పవనాలు
దేశమంతటా బీజేపీ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. హైదరాబాద్ మగ్దుంభవన్‌లో ఆదివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
- మోదీ జైలుకు వెళ్లడం ఖాయం
- బీజేపీని గద్దెదించేందుకే యాత్ర
- 14న హైదరాబాద్‌లో బహిరంగసభ
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): దేశమంతటా బీజేపీ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. హైదరాబాద్ మగ్దుంభవన్‌లో ఆదివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రోజురోజుకూ బీజేపీ సీట్లు తగ్గుతున్నాయని, కర్ణాటక ఎన్నికల్లో కూడా సీట్లు తగ్గుతాయని చెప్పారు. ప్రధాని మోదీ అవినీతి, అదానీ, అంబానీలతో ఉన్న అనుబంధం, క్విడ్ ప్రోకో అంశాలపై 2024లో కొత్తగా ఏర్పడే ప్రభుత్వ విచారణలో బహిర్గతమవుతాయని, అప్పుడు మోదీ జైలుకెళ్లడం ఖాయమని తెలిపారు.
మోదీకి చిత్తశుద్ధి ఉంటే బ్యాంకులకు ఎగ్గొట్టిన వారి ఆస్తులను జప్తు చేయాలని, నల్లధనంపై శ్వేతప్రతం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీబీఐ సంస్థను వ్యతిరేకిస్తూనే పేపర్ లీకేజీ కేసును అదే సంస్థకు అప్పగించాలని కాంగ్రెస్ కోరడం సరైంది కాదని తెలిపారు. బీజేపీని గద్దెదించేందుకే తమ పార్టీ ఆధ్వర్యంలో యాత్ర కొనసాగుతుందని, ఈ నెల 14న చేపట్టబోయే ఇంటింటికీ సీపీఐ ప్రారంభ సభను హైదరాబాద్ ఇందిరాపార్ వద్ద నిర్వహించనున్నట్టు వెల్లడించారు. మే 14న కొత్తగూడెంలో లక్ష మందితో ముగింపు సభను నిర్వహస్తామని తెలిపారు. అంతకు ముందు ఇంటింటికీ సీపీఐ పోస్టర్‌ను ఆయన ఆవిషరించారు. సమావేశంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి, పశ్య పద్మ, కలవేని శంకర్, బాగం హేమంతరావు, బాలనర్సింహ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

