లార్వా దశలోనే దోమల నియంత్రణ : మంత్రి మల్లారెడ్డి
మేడ్చల్ మల్కాజిగిరి : సీజనల్ అంటు వ్యాధులను అరికట్టే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని.. డెంగీ, మలేరియా, చికెన్‌గున్యా లాంటి విష జ్వరాలకు కారణమయ్యే దోమలను లార్వా దశలోనే నియంత్రించే చర్యలు చేపడుతున్నట్లు కార్మిక శాఖా మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు.. 10 వారాలపాటు ఇంటి పరిసరాలలో పరిశుభ్రత కార్యక్రమాన్ని కూకట్పల్లి సర్కిల్లోని ఓల్డ్ బోయిన్‌పల్లిలో మంత్రి మల్లారెడ్డి నివాసంలో నిర్వహించారు.
కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డితో పాటు జోనల్ కమిషనర్ వి.మమత, సర్కిల్ ఉప కమిషనర్ పి.రవీందర్‌కుమార్, ఎంటమాలజీ సీనియర్ అసిస్టెంట్ లచ్చిరెడ్డిలు పాల్గొన్నారు. మంత్రి మల్లారెడ్డి సమక్షంలో ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలను పరిశీలించి, నీటిలో దోమ వృద్ధిచెందే విధానాన్ని అధికారులు వివరించారు.
ఇంటి ఆవరణలోని ఖాళీగా ఉన్న టైర్లలో నీటి ఆవాసాలను గుర్తించి రసాయనాలను పిచికారి చేశారు. అనంతరం పరిశుభ్రత కార్యక్రమం అవగాహన కరపత్రాలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందన్నారు. ప్రభుత్వ వైద్యశాలలను బలోపేతం చేస్తూ సకల సదుపాయాలను కల్పిస్తుందన్నారు. ప్రజలందరూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

