ఎల్లారెడ్డిపేట, ఏప్రిల్ 21 : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని బృహత్ పల్లెప్రకృతివనంలో పది కోతులు మృత్యువాతపడ్డాయి. మంగళవారం సాయంత్రం పిల్లా పాపలతో పల్లె ప్రకృతి వనంలోకి వెళ్లిన వారికి ఫెన్సింగ్ పక్కన అక్కడక్కడా కోతులు మృతి చెంది ఉన్న విషయాన్ని గమనించారు. అప్పుడే రెం డు కోతి పిల్లలు ఏడుస్తున్న విషయాన్ని అక్కడికెళ్లినవారు గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు కోతుల బెడదను చూసి విషప్రయో గం చేశారా? అనే అనుమానాలు వ్య క్తం చేశారు. ఇప్పటికే మండల కేం ద్రంలో కోతులను పట్టి దూరంగా అ టవీ ప్రాంతంలో వదిలి వేస్తున్న తరుణంలో విషప్రయోగంతో చంపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫెన్సింగ్ దాటి వచ్చిన ఓ కోతిపిల్లను కాపాడే ప్రయత్నం చేశారు.