నిర్మల్: మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులో (Mission Bhagiratha) కోతి కళేబరం కలకలం రేపింది. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని నిగ్వ గ్రామంలో ఉన్న మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌లో కోతి కళేబరం బయటపడింది. వారం రోజులుగా అదే నీటిని స్థానికంగా సరఫరా చేస్తున్నారు. అయితే నీరు దుర్వాసన రావడంతో అనుమానం వచ్చి గ్రామస్తులు ట్యాంకును పరిశీలించారు. అందులో చనిపోయిన కోతి కనిపించడంతో సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దానికి తొలగించిన వారు ట్యాంకును శుభ్రం చేశారు. అయితే వారం రోజులుగా అదే నీటిని సరఫరా చేసిన అధికారుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు.
కాగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకున్నది. సాగర్ మునిసిపాలిటీ పరిధి విజయవిహార్ కాలనీ 1వ వార్డు విజయ్ విహార్ పక్కన 5 వేల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకు ఉంది. దీని ద్వారా సుమారు 150 ఇళ్లకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. అయితే, పది రోజులుగా కుళాయి నీటిలో వెంట్రుకలు, చిన్న చిన్న మాంసపు ముక్కలు వస్తున్నాయి. బుధవారం కొంతమంది యువకులు ట్యాంకు వద్దకు వెళ్లి చూడగా పైన మూత తొలగించి ఉంది. లోపల 30 వరకు కోతుల కళేబరాలు తేలుతున్నాయి. దీనిపై మునిసిపల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. కళేబరాలను తొలగించేందుకు మునిసిపల్ సిబ్బంది రాగా, ట్యాంకు వద్ద ఉన్న ఇంకొన్ని కోతులు దాడి చేసేందుకు ఎగబడ్డాయి. కొద్దిసేపటికి కోతులు వెళ్లిపోగా.. ట్యాంకులోని కళేబరాలను బయటకు తీశారు.
బాబోయ్.. మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులో కోతి కళేబరం..
వారం రోజులుగా అదే నీటిని సరఫరా..
నిర్మల్ – కుబీర్ మండలంలోని నిగ్వ గ్రామం మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌లో కోతి కళేబరం దొరికింది.
నీరు వాసన రావడంతో అనుమానం వచ్చి ట్యాంక్‌లో చూడగా కోతి కళేబరాన్ని చూసి గ్రామస్థులు కంగుతిన్నారు.
వారం… pic.twitter.com/cd8MwNQzQ1
— Telugu Scribe (@TeluguScribe) October 11, 2024