BBA Retailing | డిగ్రీ చదువుతూనే సంపాదన.. బీబీఏ రిటైలింగ్ కోర్సులో చేరిన విద్యార్థులకు ఆఫర్‌లెటర్లు
డిగ్రీ పూర్తయ్యాకో.. డిగ్రీ ఫైనల్ ఇయర్లోనో ప్లేస్మెంట్ రావడం.. ఉద్యోగంలో చేర డం.. మంచి వేతన ప్యాకేజీని అందుకొనే వారిని మనం చూస్తుంటాం. కానిప్పుడు అప్రెంటీష్షిప్ కోర్సుల్లో భాగంగా డిగ్రీ ఫస్టియర్‌లోనే ఇం టర్న్షిష్ చేయొచ్చు. నెలకు 5 వేల నుంచి 7 వేల వరకు సంపాదించవచ్చు.
- ఫస్టియర్‌లోనే సంస్థల్లో ఇంటర్న్‌షిప్
- వారంలో మూడు రోజులు కాలేజీ..
- మరో మూడు రోజులు ఉద్యోగంలోకి..
BBA Retailing | హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ) : డిగ్రీ పూర్తయ్యాకో.. డిగ్రీ ఫైనల్ ఇయర్లోనో ప్లేస్మెంట్ రావడం.. ఉద్యోగంలో చేర డం.. మంచి వేతన ప్యాకేజీని అందుకొనే వారిని మనం చూస్తుంటాం. కానిప్పుడు అప్రెంటీష్షిప్ కోర్సుల్లో భాగంగా డిగ్రీ ఫస్టియర్‌లోనే ఇం టర్న్షిష్ చేయొచ్చు. నెలకు 5 వేల నుంచి 7 వేల వరకు సంపాదించవచ్చు. అది వారానికి మూడు రోజులే పని. ఈ మూడు రోజులు క్లాసులకు హాజరైనట్టు లెక్కిస్తారు. ఇలాంటి అవకాశాన్ని సెక్టార్ స్కిల్ కౌన్సిల్ కోర్సుల్లో చేరిన విద్యార్థులు దక్కించుకొన్నారు. మొదటి ఏడాదే కోర్సుల్లో చేరి.. కొలువులబాట పట్టేశారు. ఫస్టియర్‌లో ఫస్ట్ శాలరీ డ్రా చేయబోతున్నారు.
40కిపైగా కాలేజీల్లో స్కిల్ కౌన్సిల్ కోర్సులు
డిగ్రీ కోర్సుల్లో సంస్కరణల్లో భాగంగా రాష్ట్రంలోని 40కి పైగా కాలేజీల్లో ఈ ఏడాది సెక్టార్ స్కిల్ కౌన్సిల్ కోర్సులను ప్రవేశపెట్టారు. వెయ్యి కి పైగా విద్యార్థులు చేరారు. వీరిలో 600 మంది విద్యార్థులు బీబీఏ రిటైల్ కోర్సులోనే ప్రవేశాలు పొందారు. విద్యార్థులకు ఆయా సంస్థల్లో ఇంటర్న్‌షిప్ చేయడానికి అవకాశం కల్పించారు. బు ధవారం నాంపల్లి తెలుగు వర్సిటీ ఆడిటోరియం లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మాజీ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లిం బాద్రి, వైస్ చైర్మన్ ఎస్కే మహమూద్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ పాల్గొని, 17 కాలేజీల్లోని డిగ్రీ విద్యార్థులకు ఆఫర్‌లెటర్లు అం దజేశారు.
ఆయా విద్యార్థులు వారంలో మూ డు రోజులు కాలేజీకెళ్తూ.. మరో మూడు రోజులు రిటైల్ కంపెనీల్లో పనిచేయాల్సి ఉంటుంది. కా ర్యక్రమంలో రిటైలర్స్ అసోసియేషన్ స్కిల్ కౌ న్సిల్ ఆఫ్ ఇండియా (రాస్కీ) సీఈవో జేమ్స్రాఫైల్, ఆ సంస్థ ప్రతినిధి సమీర్, రీజినల్ హెడ్ చందా వడ్డే, కళాశాల విద్య ఆర్జేడీలు ప్రొఫెసర్ జీ యాదగిరి, ప్రొఫెసర్ డీఆర్ఎస్ రాజేంద్రసిం గ్, అకడమిక్ గైడెన్స్ ఆఫీసర్ డీటీ చారి, ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. ఆఫర్ లెంట ర్లు అందుకొన్న పలువురు విద్యార్థులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఒకప్పుడు బస్‌పాస్ తీసేందుకు అవస్థలు పడ్డ తాను చదువుకుంటూనే నెలకు 5,500 సంపాదించడం సం తోషంగా ఉన్నదని పాలమూరు జిల్లా హన్వాడకు చెందిన సాయి ఆదిత్యారాజ్ (సిటీ కాలేజీ, హైదరాబాద్) అన్నారు. డిగ్రీలోనే ఎంతో కొం త సంపాదించడం ఆనందంగా ఉన్నదని జగిత్యాల జిల్లా ఇటిక్యాలకు చెందిన నిహారిక (ఎస్సారార్ కాలేజీ, కరీంనగర్) తెలిపారు. తన చ దువు ఖర్చులకు అమ్మను డబ్బులుడగలేక పడ్డ అవస్థలు దూరమయ్యాయని కామారెడ్డి ప్రభు త్వ కాలేజీ విద్యార్థిని జే పావని పేర్కొన్నారు.
జీవితంపై భరోసా ఏర్పడింది
మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. నాన్న లేరు. నా బాగోగులన్నీ నానమ్మే చూసుకొంటుంది. ఆమె దగ్గరే ఉండి చదువుకొంటున్నా. మంచి అవకాశాలుంటాయని చెప్పడంతో బీబీఏలో చేరా. మొదటి సంవత్సరంలోనే స్పార్ రిటైల్ స్టోర్‌లో ఉద్యోగం లభించింది. నెలకు రూ. 5,500 సంపాదిస్తున్నా. ఖర్చుల కోసం ఎవరి మీదా ఆధారపడటం లేదు. డిగ్రీ పూర్తయ్యాక జీవితంలో స్థిరపడగలనన్న నమ్మకం, భరోసా దొరికింది.
– సర్ఫరాజ్ అహ్మద్, బీబీఏ సిటీ కాఏలజీ, హైదరాబాద్
పేద విద్యార్థులకు మంచి అవకాశం
ఈ విద్యాసంవత్సరంలో స్కిల్ కౌన్సిల్ కోర్సుల్లో భాగంగా మా కాలేజీలో బీబీఏ రిటైల్ కోర్సును ప్రవేశపెట్టాం. మొదటి ఏడాదే 60 సీట్లకు 48 సీట్లు భర్తీ అయ్యాయి. విద్యార్థులకు అప్రెంటీష్షిప్ కల్పించేందుకు కళాశాల విద్య కమిషనరేట్ అధికారులే రిటైల్ సంస్థలతో ఒప్పదం చేసుకొన్నారు. మొదటి సంవత్సరంలోని విద్యార్థులందరికీ ఇంటర్న్‌షిప్‌లో ఉద్యోగాలు లభించాయి. విద్యార్థులు సంపాదన కోసం క్లాసులకు డుమ్మాకొట్టే అవకాశం తగ్గింది. పేద, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తమ సొంతకాళ్లమీద నిలబడే అవకాశం కలిగింది.
– డాక్టర్ రామకృష్ణ, ప్రిన్సిపాల్, ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, కరీంనగర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

