హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : సింగరేణి డైరెక్టర్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్(ఈఅండ్ఎం)గా మోకాళ్ల తిరుమలరావును సంస్థ యాజమాన్యం నియమించింది. సోమవారం సింగరేణి భవన్లో ఆయన బాధ్యతలు స్వీకరించారు.
సింగరేణి చరిత్రలో తొలిసారిగా కోయతెగకు చెందిన తిరుమలరావు డైరెక్టర్గా నియమితులయ్యారు. సంస్థ సీఎండీ బలరామ్ నాయక్ గిరిజన సామాజికవర్గానికి చెందిన వారే కావ డం గమనార్హం. సంస్థ డైరెక్టర్లుగా ఎల్వీ సూర్యనారాయణ, కే వెంకటేశ్వర్లు, గౌతమ్పొట్రు కొనసాగుతున్నారు.