హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో రాత్రివేళ చలి గజ గజ వణికిస్తున్నది. జనవరి రాకముందే చలి తీవ్రత పెరిగింది. శుక్రవారం తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో అత్యంత కనిష్ఠంగా 11.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో మూడు రోజులు చలి తీవ్రత ఇదేవిధంగా కొనసాగనున్నదని వాతావారణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో రెండు ఉపరితల ఆవర్తనాలు ఏర్పడ్డాయి.
వీటిలో ఒకటి బంగాళాఖాతంలో నైరుతి దిక్కున తమిళనాడుకు దగ్గరలో ఉన్నది. ఇది భూమికి 1.5 కి.మీ నుంచి 3.1 కి.మీ వరకు ఉన్నది. రెండోది తమిళనాడుకు దక్షిణంగా, సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తున ఏర్పడింది. తెలుగు రాష్ర్టాలకు ఎలాంటి వర్షసూచన లేదని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో గాలుల వేగం గంటకు 4 నుంచి 12 కిలోమీటర్లుగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.