ఖమ్మం : వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు కేంద్రంలోని మోదీ సర్కారు అనేక ఎత్తులు వేసి విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. జిల్లా కేంద్రం ఎంబీ గార్డెన్లో జరుగుతున్న సీపీఐ (ఎం) ఖమ్మం జిల్లా 21వ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
నల్ల చట్టాలను రద్దు చేస్తామని మోదీ రైతులకు చెప్పిన క్షమాపణలో మతలబు దాగి ఉందన్నారు. ఏడు వందలమంది రైతులు చనిపోయినందుకు మోదీ క్షమాపణలు చెప్పలేదని తమ్మినేని గుర్తు చేశారు. రాబోవు అతికొద్ది రోజుల్లో వివిధ రాష్ట్రాలలో జరుగనున్న శాసనసభ ఎన్నికలలో గెలవాలనే మోదీ ఎత్తుగడలు వేస్తున్నారని ఆయన విమర్శించారు.
మళ్లీ నల్ల చట్టాలను ఎల్ఐసీ,ఎయిర్ ఇండియా, బొగ్గుగనులు, లాంటి పెద్ద పెద్ద సంస్థలను కార్పొరేట్ శక్తులకు అమ్మకానికి పెట్టా మోదీపై ధ్వజమెత్తారు. ప్రజాదనాన్ని కొల్లగొడుతూ..కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్న బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.