హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ మత విద్వేషాలు రగిల్చేలా ‘జై బజరంగ బలి’ అంటూ ఓట్లు అడగటం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ మండిపడ్డారు. సోమవారం హైదరాబాద్ మగ్దూం భవన్లో రాష్ట్ర సమితి సమావేశాల్లో మాట్లాడుతూ..
బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్రకటించడం పట్ల ఆగ్రహం వ్యక్తంచేశారు. సీపీఐ జాతీ య కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు వెంకట్రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటస్వామి ఉన్నారు.