హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ధాన్యం నిల్వలో ఆధునిక పద్ధతులు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని రాష్ట్ర సివిల్ సైప్లె శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. వరి ఉత్పత్తి అధికంగా ఉండే జిల్లాల్లోని 20 చోట్ల అత్యాధునిక సైలోస్‌లు ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నదని వెల్లడించారు. శుక్రవారం సచివాలయంలో ధాన్యం నిల్వ, రవాణా రంగానికి చెందిన ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు, నిల్వ, రవాణాలో మరింత మెరుగైన పద్ధతులను అనుసరిస్తామని వివరించారు.