మేడ్చల్ : మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు సాధారణ వాతావరణం నెలకొనగా సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం పడింది. మియాపూర్, చందానగర్, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. వరద రోడ్లపైకి చేరడంతో సాయంత్రం కార్యాలయాల నుంచి ఇండ్లకు వెళ్లే ఉద్యోగులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.