హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తేతెలంగాణ) : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో శనివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుక్రవారం తెలిపింది.
ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో గంటకు 6 నుంచి 10 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, ఆకాశం మేఘావృతమై ఉంటుందని, ఉదయం వేళల్లో పొగమంచు అధికంగా ఉంటుందని పేర్కొంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం నుంచి రాత్రి వరకు చినుకులు పడే అవకాశం ఉందని వెల్లడించింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 31, కనిష్ట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉందని వివరించింది.