హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు జూన్ 5, 6 తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షలను వాయిదావేసినట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన తెలిపారు. జూన్ 5న 6వ తరగతి, జూన్ 6న 7వ -10వ తరగతుల్లోని ఖాళీ సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్షలునిర్వహించాల్సి ఉండగా.. కరోనా, లాక్డౌన్ దృష్ట్యా వాయిదా వేశామన్నారు.