హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జరుగుతున్న నేతన్నల ఆత్మహత్యలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ స్పష్టం చేశారు. వాటికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నేతన్నల ఆత్మహత్యలు మళ్లీ ప్రారంభమయ్యాయని తెలిపారు. గత డిసెంబర్ నుంచి పది వేల కుటుంబాలకు పని లేకుండా పోయిందని చెప్పారు. నేతన్నల వద్ద పేరుకపోయిన వస్ర్తాలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ నేత ఎంఎన్ శ్రీనివాస్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో వ్యవసాయం తరువాత ఎక్కువ మందికి ఉపాధి కల్పించే రంగం టెక్స్టైల్ అని తెలిపారు. చేనేత పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోవడానికి రేవంత్ సరార్ కారణమని ఆరోపించారు. ఎమ్మెల్సీగా తాను రాష్ట్ర మంత్రి తుమ్మల దృష్టికి చేనేతల సమస్య తీసుకెళ్లానని, తమ సూచనలు పట్టించుకొని ప్రభుత్వం స్పందించి ఉంటే నేతన్న ఆత్మహత్యలు జరిగేవి కావన్నారు. నేతన్నలకు వర్ ఆర్డర్ పెంచాలని, బకాయిలు చెల్లించాలని, కేసీఆర్ హయాంలో ప్రకటించిన పథకాలు కొనసాగించాలని డిమాండ్ చేశా రు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ ఎత్తివేస్తామని భారత్ జోడో యాత్రలో రాహుల్‌గాంధీ చెప్పారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నేతన్నలు ఆత్మైస్థెర్యంతో ఉండేలా బతుకమ్మ, ఇతర ప్రభుత్వ ఆర్డర్లు ఇచ్చిందని గుర్తుచేశారు. చేనేతలకు నెలకు రూ.2 వేలు, అనుబంధ పనులు చేసే వారికి మరో రూ.1000 పింఛన్ ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దకుతుందని చెప్పారు. నేతన్న బీమా పథకం ద్వారా చేనేతల కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థికసాయం చేశారని తెలిపారు.