అమిత్ షా బకాయిల సంగతేంది?
కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు. రాష్ర్టానికి కేంద్రం ఏమిచ్చిందో సమాధానం చెప్పాలని నిలదీశారు. జాతీయ స్థాయిలో పెరుగుతున్న నిరుద్యోగం, ఆకాశాన్నంటే ద్రవ్యోల్బణంపై జవాబివ్వాలని డిమాండ్ చేశారు. శనివారం ట్విట్టర్ వేదికగా అమిత్ షాకు పలు ప్రశ్నలను సంధించారు. ఆ ప్రశ్నలివీ..
- రాష్ర్టానికి ఇవ్వాల్సిన బీఆర్జీఎఫ్ నిధులేవీ?
- ఆకాశాన్నంటే ద్రవ్యోల్బణంపై ఏమంటావు?
- కేంద్ర హోంమంత్రిని ప్రశ్నించిన ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు. రాష్ర్టానికి కేంద్రం ఏమిచ్చిందో సమాధానం చెప్పాలని నిలదీశారు. జాతీయ స్థాయిలో పెరుగుతున్న నిరుద్యోగం, ఆకాశాన్నంటే ద్రవ్యోల్బణంపై జవాబివ్వాలని డిమాండ్ చేశారు. శనివారం ట్విట్టర్ వేదికగా అమిత్ షాకు పలు ప్రశ్నలను సంధించారు. ఆ ప్రశ్నలివీ..
- ఆర్థిక సంఘం నుంచి రాష్ర్టానికి రావాల్సిన రూ.3,000 కోట్ల గ్రాంట్ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారు?
- రాష్ర్టానికి బ్యాక్వర్డ్ రీజియన్ గ్రాంట్ ఫంట్(బీఆర్జీఎఫ్)రూ.1,350 కోట్లు ఎప్పుడిస్తారు?
- జీఎస్టీ రూ.2,247 కోట్ల పరిహారం ఇచ్చేదెప్పుడు?
- కేంద్రం అనాలోచిత వైఖరి వల్ల ఆకాశాన్నంటుతున్న ద్రవ్యోల్బణంపై అమిత్ షా సమాధానం చెప్పాలి
- దేశంలో రికార్డు స్థాయిలో పెరుగుతున్న నిరుద్యోగంపై జవాబివ్వాలి
- బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మత విద్వేషాలు పెచ్చరిల్లుతున్నాయి, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం వల్ల అల్లర్లు పెరుగుతున్నాయి అని బీజేపీ ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి.. దీనికి ఏ సమాధానం చెప్తారు?
- ప్రపంచంలోనే ఎక్కువ రేటుకు ఇంధనం, వంట గ్యాస్‌ను అమ్మి దేశాన్ని అగ్రగామిగా మార్చటమే మేకింగ్ ఇండియా ఉద్దేశమా?
- కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎనిమిదేండ్లుగా తెలంగాణకు ఏం చేసింది?
- ఐఐటీ, ఐఐఎం, ఐసర్, ట్రిపుల్ ఐటీ, ఎన్ఐడీ, మెడికల్ కాలేజీలు, నవోదయ పాఠశాలలను దేశమంతా ఏర్పాటు చేస్తూ తెలంగాణకు మాత్రమే ఎందుకివ్వలేదు?
- మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలను నీతి ఆయోగ్ ప్రశంసించటమే కాకుండా, రూ.24 వేల కోట్లు ఇవ్వాలని సిఫారసు చేస్తే వాటిని ఇవ్వకుండా కేంద్రం ఎందుకు విస్మరించింది?
- కర్ణాటకలోని అప్పర్‌భద్రకు జాతీయ హోదా, బుందేల్‌ఖండ్‌లోని కెన్-బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి, పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులకు జాతీయ హోదా నిరాకరించటం కేంద్ర ప్రభుత్వ కపటత్వం కాదా?
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

