హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): నిజామాబాద్ పట్టణంలోని హౌజింగ్‌బోర్డు కాలనీలో ఉంటున్న దిగువ, మధ్య తరగతి ప్రజలపై ఆర్థిక భారం పడకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ఆమె మండలిలో మాట్లాడుతూ.. హౌజింగ్‌బోర్డుకు భూములిచ్చిన యజమానులు కోర్టులకు వెళ్లడం, ధరల పెరుగుదల కారణంగా లబ్ధిదారులపై రూ.18 కోట్ల అదనపు భారం పడుతున్నదని చెప్పారు. దీనిపై గృహనిర్మాణశాఖ మంత్రి స్పందిస్తూ సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికితీసుకెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.