MLC Kavitha | మహిళా రిజర్వేషన్లు నా వ్యక్తిగత ఎజెండా కాదు.. బిల్లు కోసం డిసెంబర్లో మళ్లీ దీక్ష చేస్తాం : ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha | మహిళా రిజర్వేషన్లు తన వ్యక్తిగత ఎజెండా కాదని ఎమ్మెల్యీ కల్వకుంట్ల కవిత అన్నారు. దేశంలోని మహిళలందరూ చట్టసభల్లో రిజర్వేషన్లు కోరుకుంటున్నారని తెలిపారు. మహిళల రిజర్వేషన్ల కోసం అంబేడ్కర్ కూడా కొట్లాడారని ఆమె గుర్తుచేశారు.
MLC Kavitha | మహిళా రిజర్వేషన్లు తన వ్యక్తిగత ఎజెండా కాదని ఎమ్మెల్యీ కల్వకుంట్ల కవిత అన్నారు. దేశంలోని మహిళలందరూ చట్టసభల్లో రిజర్వేషన్లు కోరుకుంటున్నారని తెలిపారు. మహిళల రిజర్వేషన్ల కోసం అంబేడ్కర్ కూడా కొట్లాడారని ఆమె గుర్తుచేశారు. ప్రస్తుతం పార్లమెంటులో మహిళలు కేవలం 12 శాతం మాత్రమే ఉన్నారని అన్నారు. తొలి లోక్‌సభలో 8 శాతం మహిళా ఎంపీలే ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 12 శాతానికి మాత్రమే చేరిందని అన్నారు. మణిపూర్‌లో ఇప్పుడు ఇద్దరు మహిళలు మాత్రమే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారని తెలిపారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగానే మహిళలు మిగిలిపోవాలా? అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.
కిషన్‌రెడ్డి, బీజేపీ నాయకులు అనవసరంగా తనపై విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. 2010 రాజ్యసభలో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లు.. 2023 వచ్చినా ఎందుకు ఆమోదం పొందడం లేదని ప్రశ్నించారు. 14 ఏండ్లుగా మోదీ సర్కార్ మహిళా బిల్లును ఎందుకు ఆమోదించడం లేదని నిలదీశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం వచ్చే డిసెంబర్లో మరోసారి దీక్ష చేస్తామని ఆమె ప్రకటించారు. ఈ దీక్షకు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, స్మృతి ఇరానీ సహా మహిళా నేతలు అందర్నీ ఆహ్వానిస్తామని తెలిపారు.
ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగినట్లు ఓ ప్రొఫెసర్ ఆరోపించారని గుర్తు చేసిన ఎమ్మెల్సీ కవిత.. దీన్ని ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏ పార్టీకి ఓటు వేసినా బీజేపీకే వెళ్తుందని ఓ ఎంపీ అనడం దారుణమని పేర్కొన్నారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా చర్యలు తప్పవని బీఆర్ఎస్ నాయకులను ఆమె హెచ్చరించారు. ప్రజాజీవితంలో ఉన్న ఎవరైనా సరే మర్యాదగా మాట్లాడాలని సూచించారు. ఎమ్మెల్యే టికెట్ రాని అందరికీ తగిన ప్రాధాన్యం కల్పిస్తామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌కు భయమన్నది లేదని తెలిపారు. కాంగ్రెస్ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తుందని ఆమె ఆరోపించారు. గత ఎన్నికల్లో హామీలను ప్రజలు నమ్మలేదని అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

